అతి తక్కువ ప్రీమియంకే రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్
- October 06, 2016
దీపావళి పండుగ సమీపిస్తున్న సందర్భంగా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఒక్కపైసా రుసుంతో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టింది. 92పైసలున్న ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను శుక్రవారం నుంచి ఒక్కపైసాకు తగ్గిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 1నుంచి రైల్వేశాఖ ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రవేశపెట్టింది. అక్టోబర్ 31 వరకూ మాత్రమే ఈ ఒక్కపైసా ఇన్సూరెన్స్ పథకం అమలులో ఉంటుంది. అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు చేరువయ్యేందుకు ఈ పథకం ఉపయోగపడనుందని ఐఆర్సీటీసీ ఛైర్మన్ ఏకే మనోచా పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 2016-17 రైల్వే బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ బీమాను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







