చలవ చేసే ఆహార పదార్ధాలు..
- October 06, 2016
అమ్మో వేడి చేసేసింది.. అంటూ చాలామంది చెపుతుంటారు... వేడి చేస్తే ముఖం అందవికారంగా మారుతుంది. పెదాలు నల్లబడిపోతాయి... ముఖం మాడిపోయినట్లు అవుతుంది. అంతేకాదు... కడుపులో మంట... కళ్ళు మంట... ఇలా ఒంట్లో వేడి తన్నుకొచ్చేసి... కస్సుబుస్సు లాడుతుంటారు. ఈ వేడంతా పోవాలంటే ప్రకృతి సిద్ధంగా ఇలా చేయండి.
- ఒక టేబుల్ స్పూన్ మెంతులు నిత్యం చేసుకునే ఆహార పదార్ధాలలో వాడండి... అంటే కూరలు, పులుసులు చేసేటపుడు వేసే పోపులో ఇవి ఉంటే చాలు. మెంతులు మన శరీరంలోని వేడిని బాగా లాగేస్తాయి.
- ఉదయాన్నే గ్లాసుడు నిమ్మరసం తాగితే... ఒంట్లో వేడి తగ్గుతుంది. ఉప్పు, లేదా పంచదార వేసుకుని నిమ్మ నీళ్ళ తాగొచ్చు.
- దానిమ్మ జ్యూస్ తీసి, అందులో ఆల్మండ్ ఆయిల్ నాలుగు చుక్కలు వేసుకుని తాగితే చలవ.
- గ్లాసుడు పాలలో రెండు టేబుల్ స్పూన్ల వెన్న కలుపుకొని తాగితే వేడి తగ్గుతుంది.
- గసగసాలు వేడిని బాగా తగ్గిస్తాయి... కానీ, మోతాదు మించి తీసుకోవద్దు
- గ్లాసుడు పాలలో చెంచాడు తేనె కలుపుకొని తాగితే శరీరం అంతా కూల్
- అసలు మంచి నీళ్లు బాగా తాగితే... శరీరంలో వేడి తగ్గిపోయి.. సమ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది.
- అలోవెరా జ్యూస్ చలవ చేస్తుంది... దాని ఆకుల మధ్య జెల్ నుదుటికి రాసుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది.
- గంధం చల్లని నీరు, లేదా పాలతో కలిపి నుదుటకు రాసుకుంటే వేడి మటుమాయం.
- అన్నింటికీ మించి కొన్ని బార్లీ గింజలు వేడి నీళ్ళలో కాచి, మజ్జిగ వేసుకుని పలచగా తాగితే వేడి తగ్గుతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







