పనస బిర్యానీ
- October 06, 2016
కావలసిన పదార్థాలు: పండని పనసకాయ ముక్కలు- 6 కప్పులు, బాస్మతి బియ్యం- 4 కప్పులు, లవంగాలు- 5, యాలకులు- 3, దాల్చిన చెక్క- 1 (పెద్దది), బిర్యానీ ఆకులు- 3, ఉల్లిపాయ తరుగు- 1/2 కప్పు, కొత్తిమీర తరుగు- 2 టేబుల్ స్పూన్లు, పుదీనా తరుగు- 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి- 1 టేబుల్ స్పూను, నూనె- 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, నీళ్ళు- 12 కప్పులు, పెరుగు- 1/2 కప్పు, పచ్చి మిర్చి పేస్ట్- 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టేబుల్ స్పూను, పసుపు- 1 టీ స్పూను, దనియాల పొడి- 1 టీ స్పూను, నిమ్మ రసం- 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా- ఒకటిన్నర టీ స్పూను
తయారీ విధానం: ఆరు కప్పుల నీళ్ళు మరిగించి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, బియ్యం వేసి ఉడికించి కాస్త పలుకుగా ఉన్నప్పుడే దింపేసి నీళ్ళు వార్చేయాలి. మరో ఆరు కప్పుల నీళ్ళలో పనస ముక్కలు, 1/2 టీ స్పూను పసుపు, ఒక టీ స్పూను ఉప్పు వేసి పదినిమిషాలు ఉడికించాలి. నీళ్ళు వంపేసి ముక్కలకు పెరుగు, నిమ్మరసం, పచ్చిమిర్చి పేస్టు, దనియాల పొడి, పసుపు, టీ స్పూను ఉప్పు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా పట్టించి అరగంట నానబెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను వేగించి తీసి పక్కన పెట్టాలి. ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించి పనస ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి రెండు నిమిషాలు వేగించాలి. తరువాత ఒక మందపాటి పాత్రలో ఒక పొర అన్నం, ఒక పొర పనస ముక్కలు వేస్తూ మొత్తం సర్ధి ఆవిరి పోకుండా మూత పెట్టి, అరగంట సిమ్‌లో ఉడికించాలి. చివర్లో, వేగించిన ఉల్లిపాయ ముక్కల్ని జల్లాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







