జోయాలుక్కాస్ క్యాన్సర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్
- October 06, 2016
మనామా: జోయాలుక్కాస్ గ్రూప్ 'థింక్ పింక్ 2016', 'మామ్ ఐ నీడ్ యు' అనే క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. మహిళలకు, ముఖ్యంగా తల్లులకు మోటివేషన్ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'మామ్ ఐ నీడ్ యు' క్యాంపెయిన్ ద్వారా పిల్లల్లో అవగాహన పెంచడం, తమ తల్లులు రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. నెల రోజులపాటు మల్టీ మీడియా క్యాంపెయిన్ జరగనుంది. జోయాలుక్కాస్ గ్రూప్ డైరెక్టర్ సోనియా అలుక్కాస్ మాట్లాడుతూ, 11 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. 10 మిలియన్ వినియోగదారులు తమకు ఉన్నారని చెప్పారామె. దుబాయ్ హెల్త్ అథారిటీ మద్దతుతో థింక్ పింక్ క్యాంపెయిన్ అక్టోబర్ 2011లో ప్రారంభమయ్యింది. ఇప్పటిదాకా 40,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని, బ్రెస్ట్ స్క్రీనింగ్ సౌకర్యాల్ని పొందారు. చిన్నారులు, తమ తల్లుల ఆరోగ్యం మీద శ్రద్ధతో, బ్రెస్ట్ స్క్రీనింగ్ కోసం సోషల్ మీడియా ద్వారా మంచి మంచి మెసేజ్‌లను పంపించవచ్చనీ, అలాంటివాటిల్లో మంచి మెసేజ్‌ని ఎంపిక చేసి 2,500 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ విలువైన డైమండ్‌ని బహుమతిగా ఇస్తామని జోయాలుక్కాస్ గ్రూప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







