అమ్మ క్షేమంగా తిరిగి రావాలంటూ కోరుకుంటూ పూజలు
- October 07, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సింగపూర్ వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. గత నెల 22వతేదీన అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కాగా... ఇప్పటికే ఆమెకు లండన్ నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు ఆమెకు వైద్య చికిత్సలు నిర్వహించారు. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు కూడా చికిత్స నిర్వహించారు. కాగా... శుక్రవారం సింగపూర్ నుంచి వచ్చిన వైద్యులు ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు. అలాగే జయలలితను సింగపూర్ తరలించే అవకాశముందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళనాడు ప్రజలు 'అమ్మ'గా పిలుచుకునే జయలలిత...త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఇప్పటికే జయలలిత అనారోగ్యంపై తీవ్ర ఆందోళనతో ఉన్న ఆపార్టీ కార్యకర్తలు ఆమెను సింగపూర్ కు తరలిస్తారని వెలువడ్డ వార్తలతో మరింతో ఆందోళన చెందుతున్నారు. అమ్మ క్షేమంగా తిరిగి రావాలంటూ కోరుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







