బహ్రెయిన్‌లో కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల జోరు
- October 07, 2016
మనామా: మునిసిపల్ అథారిటీస్ లెక్కల ప్రకారం కన్స్ట్రక్షన్ లైసెన్సుల జోరు గడచిన తొమ్మిది నెలల్లో అద్భుతంగా ఉందని తెలియవస్తోంది. తాజా వివరాల ప్రకారం 817 పర్మిట్స్ గత జనవరి నుంచి మంజూరు అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 570 పర్మిట్స్ మాత్రమే మంజూరయ్యాయి. 567 మిలియన్ బహ్రెయినీ దినార్స్ నుంచి 1.350 బిలియన్ బహ్రెయినీ దినార్స్‌కి ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల్లో పెరుగుదల నమోదు చేసింది. ఇవన్నీ నిర్మాణం పూర్తి చేసుకుంటే, 4.9 మిలియన్ చదరపు మీటర్లను కవర్ చేస్తాయి. 2015లో ఈ మొత్తం 2 మిలియన్ చదరపు మీటర్లు మాత్రమే. లెవీ చేసిన మునిసిపల్ పీజు గత తొమ్మిది నెలల్లో డబుల్‌గా ఉంది. 900,000 బహ్రెయినీ దినార్స్ నుంచి 2 మిలియన్ బహ్రెయినీ దీనార్లుగా లెక్కలు తేలాయి. డిఊ్యటీ ప్రీమియర్ షేక్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ వివరాల్ని వెల్లడించారు. కన్స్ట్రక్షన్ పర్మిట్స్‌కి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ ప్రాసెసింగ్ విధానాన్ని (న్యూ లుక్ ఎలక్ట్రానిక్ సిస్టమ్) డిప్యూటీ ప్రీమియర్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







