'ఇండిగో' ఎయిర్లైన్స్ వారి పండగ ఆఫర్
- October 07, 2016
పండగల సీజన్లో టిక్కెట్ ధరలను తగ్గించే జాబితాలో ఇప్పుడు ఇండిగో కూడా చేరింది. ఒక వైపు ఛార్జీలను అన్నింటిని కలిపి రూ.888లకే ఇవ్వడానికి ఇండిగో సిద్ధమైంది. ఈ అవకాశం అక్టోబర్ 8 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్ 2017 ఏప్రిల్ 13 వరకు వర్తిస్తుంది. అయితే ఎన్ని సీట్లకు ఈ ఆఫర్ను ఇచ్చింది పేర్కొనలేదు. ఇండిగో అధికారిక వైబ్సైట్లలో దిల్లీ-జయపుర రూట్ల మధ్య వచ్చే సంవత్సరం జనవరి నుంచి టిక్కెట్టు ధర రూ. 888గా పేర్కొన్నారు. దిల్లీ-ముంబయి ఎకానమీ క్లాస్ టిక్కెట్టు ధరలు కూడా రూ.2,152లుగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వాటి ధర రూ.5,642గా ఉంది. అయితే ఇప్పటికే విస్తారా, స్పైస్జేట్,ఎయిర్ఏషియా ఇండియా, జెట్ ఎయిర్వేస్ పండగ ఆఫర్లతో ముందుకు వచ్చాయి.
వీటి రాయితీ ఆఫర్లు అన్ని కూడా వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు వర్తించే విధంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







