విశాఖ విమానాశ్రయం కొత్త రికార్డు నమోదు
- October 07, 2016
విశాఖపట్నం విమానాశ్రయం కొత్త రికార్డును నమోదు చేసింది. ఆగస్టులో విశాఖ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 2,05,445 మంది ప్రయాణం చేశారు. ఇందులో అంతర్జాతీయ ప్రయాణికులు 7,897 మంది కాగా, డొమెస్టిక్ ప్రయాణికులు 1,97,548 మంది. విమానాశ్రయ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక నెలలో రెండు లక్షల మంది ప్రయాణించిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు విశాఖ నుంచి మొత్తం 9,42,794 మంది ప్రయాణం చేశారు. ఇదే కాలానికి గత ఏడాది 6,77,779 మంది ప్రయాణించారు. ఆగస్టులో విజయవాడ విమానాశ్రయం నుంచి 56,312 మంది, తిరుపతి విమానాశ్రయం నుంచి 45,646 మంది, రాజమండ్రి విమానాశ్రయం నుంచి 21,245 మంది ప్రయాణించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







