శింబు 'ఏఏఏ' టీజర్ రిలీజ్
- October 07, 2016
తమిళ హీరో శింబు ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో 'ఏఏఏ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రం వెరైటీ స్టోరీతో సైంటిఫిక్ థ్రిల్లర్ గా సాగనుండగా ఈ సినిమా పూర్తి పేరు 'అన్బానవన్..అసరాదవన్...అడంగాదవన్'. అంటే ... ప్రేమించేవాడు, భయపడనివాడు, లొంగనివాడు అని అర్ధం. ఈ చిత్రంలో శింబు మూడు ప్రధాన పాత్రలలో కనిపించనుండగా 90 కిలోల బరువుగల 60 యేళ్ల వృద్ధుడి పాత్రకు సంబంధించిన లుక్ ని తాజాగా విడుదల చేశారు. ఆ పాత్ర పేరు అశ్విన్ తాతా కాగా ఈ లుక్ కోసం శింబు ఎన్నో కసరత్తులు చేసాడు. వైద్యుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బరువు పెరిగాడు. ఇక ఈ చిత్రంలో కథానాయికలుగా తమన్నా , శ్రియ కనిపించనున్నారు.
తాజాగా చిత్రానికి సంబంధించి టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ లో మదన మైకెల్ క్యారెక్టర్ ని మాత్రమే చూపించారు. ఇక త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి తాజాగా విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







