భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
- October 07, 2016
84వ వసంతాల్లోకి అడుగుపెట్టిన భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత శక్తివంతంగా రూపుదిద్దుకోనుందని, ఆధునికతను అందిపుచ్చుకోనుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఐఏఎఫ్ శక్తి సామర్థ్యాలపై దేశం గర్విస్తుందని, గడిచిన ఎనిమిది దశాబ్దాల్లో వారు అందించిన సేవలు మరువలేవని 84వ వార్షికోత్సవం సందర్భంగా ప్రణబ్ కొనియాడారు. భారత వైమానిక దళానికి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.
వైమానికదళ యోధులకు, వారి కుటుంబాలకు ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
మీ ధైర్య సాహసాలు భారత్ కు గర్వించదగ్గవని పేర్కొన్నారు. భారత భద్రతను పెంచడంలో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వైమానిక దళ సభ్యులకు, వారి కుటుంబాలకు ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు ఘజియాబాద్ లోని హిండోన్ బేస్ లో వైమానిక దళ వేడుకలు అంబురాన్నంటాయి. ఈ వేడుకల్లో వైమానిక దళ చీఫ్ అరుఫ్ రహా పాల్గొన్నారు. భారత తేజాస్ బృంద వైమానిక విన్యాసాలు అదరగొట్టాయి. శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర వహించే ర్యాపిడి యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) కవాతులు ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. వైమానిక దళ సిబ్బందిని వాయు సేన మెడల్స్, శౌర్య వాయు సేన మెడల్స్, విశిష్ట సేవ మెడల్స్ తో అరుఫ్ రహా సత్కరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







