'లక్ష్మీ బాంబ్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల
- October 07, 2016
గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం `లక్ష్మీ బాంబ్'. ఫ్రమ్ శివకాశి అనేది చిత్ర ట్యాగ్ లైన్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ నిర్మించారు. మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో మంచు లక్ష్మీ జడ్జ్ పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్పటి వరకు మంచు లక్ష్మీ చేయని పవర్ఫుల్ రోల్లో ఆమెను దర్శకుడు ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం మనోజ్ ఫైట్ మాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఆడియోని దాసరి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







