'లక్ష్మీ బాంబ్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

- October 07, 2016 , by Maagulf
'లక్ష్మీ బాంబ్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం `లక్ష్మీ బాంబ్'. ఫ్రమ్ శివకాశి అనేది చిత్ర ట్యాగ్ లైన్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ నిర్మించారు. మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో మంచు లక్ష్మీ జడ్జ్ పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్పటి వరకు మంచు లక్ష్మీ చేయని పవర్‌ఫుల్ రోల్‌లో ఆమెను దర్శకుడు ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం మనోజ్ ఫైట్ మాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఆడియోని దాసరి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com