అక్టోబర్ చివరిలో మొదలుకానున్న టీఎస్ఆర్టీసీ మినీబస్సు సర్వీసులు
- October 08, 2016
ఫ్రాన్స్ ప్రభుత్వ సహకారంతో ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణరావు తెలిపారు. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. జర్మనీలో జరిగిన అంతర్జాతీయ బస్ కంపెనీల ప్రదర్శనలో పాల్గొన్న ఆయన ఆ వివరాలను వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్‌పోర్టు విధానంలో, బస్ ఎక్కడ ఉందో జీపీఎస్ ద్వారా తెలుసుకోవడంతో పాటు సౌర విద్యుత్ ఆధారంగా ఎలక్ట్రానిక్ బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్ బోర్డులను బస్స్టేషన్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం వల్ల ఏ బస్, ఎప్పుడు వస్తుందో సులువుగా తెలుస్తుందన్నారు. 9 నెలల పాటు ఫ్రాన్స్ ప్రభుత్వం దీన్ని ప్రయోగాత్మకంగా కోఠి-ఉప్పల్ రహదారిలో అమలు చేస్తుందని చెప్పారు. కేంద్రం సహకరిస్తే బ్యాటరీ ద్వారా నడిచే ఎలక్ట్రికల్ బస్సులను నడుపుతామన్నారు. ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఈ బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో ఇప్పటివరకు ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వ్యవస్థను రద్దు చేసినట్లు చెప్పారు.
ఈ నెలాఖరులోగా మినీ బస్సులను తిప్పుతామని, మరో ఐదారు నెలల్లో ఆర్టీసీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకుల నిర్వహణ ప్రారంభమవుతుందని చెప్పారు. బయో డీజిల్‌తో నడిచే రెండు బస్సులను ఈ నెలాఖరు నుంచి నడపనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







