పాక్ తయారీ బాంబులను ఉపయోగిస్తున్న ఉగ్రవాదులు
- October 08, 2016
ఈ నెల ఆరున నౌగామ్ సెక్టార్లో ఎల్ఓసీ వద్ద అక్రమ చొరబాట్లకు యత్నించి హతమైన నలుగురు ఉగ్రవాదులకు పాక్ అందించిన మద్దతుకు సంబంధించి ఆధారాలను ఇండియన్ ఆర్మీ బయటపెట్టింది. ఉగ్రవాదులనుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లపై పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ముద్రలున్నాయి. అంతే కాదు మందులు, తినుబండారాలపై కూడా పాక్‌లో తయారీ గుర్తులున్నాయి. ఘటనా స్థలం నుంచి 4 ఏకే 47 రైఫిళ్లు, 14 ఏకే 47 మాగ్జిన్లు, 349 రౌండ్ల బుల్లెట్లు, ఒక జిపిఎస్, శాంసంగ్ మొబైల్ ఫోన్, రేడియో సెట్, బైనాక్యులర్, రెండు వైర్ కట్టర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. సైన్యం స్వాధీనం చేసుకున్న వాటిలో మండే స్వభావం ఉన్న ద్రవ పదార్ధాలు, లైటర్లు కూడా ఉన్నాయి. యూరీ తరహా దాడికి పాల్పడే కుట్రతో నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి వచ్చేందుకు యత్నిస్తూ ఇండియన్ ఆర్మీ చేతిలో ఈ నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్ ప్రమేయాన్ని ఎన్నిసార్లు నిరూపించినా నవాజ్ సర్కారు మాత్రం తాము ఉగ్రవాదులకు సహకరించడం లేదని బుకాయిస్తోంది. పైగా తామే ఉగ్రవాద బాధితులమని చెప్పుకుంటోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







