కబడ్డీలో ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం

- October 08, 2016 , by Maagulf
కబడ్డీలో ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం

కబడ్డీ ప్రపంచకప్‌ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ బోణీ చేసింది. తొలిసారి భారీ స్థాయి టోర్నీలో పాల్గొంటున్న ఆస్ట్రేలియాపై 54-20తో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో కొరియా చేతిలో కొద్దిలో ఓటమి చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. వరుస రైడ్‌, ట్యాకిల్‌ పాయింట్లతో చెలరేగింది. ప్రథమార్థంలో 32-7తో భారీ ఆధిక్యంలో నిలిచిన టీమిండియా ద్వితీయార్థంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. 54-20తో విజయం సాధించి సరిహద్దులోని సైనికులకు గౌరవ వందనం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com