జపనీస్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న తాప్సీ
- October 08, 2016
ఇటీవలే పింక్ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సొట్టబుగ్గల తాప్సీ. 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఎన్నో చిత్రాల్లో నటించినా ఈమెకు సరైన విజయం దక్కలేదు. ముఖ్యంగా గ్లామర్‌కు సై అంటూ అవకాశాలు అందుకున్నా కూడా విజయం దక్కకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. తాజాగా పింక్ సినిమా విజయంతో ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. గత ఏడాది బేబీ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన తాప్సీ, దానికి సీక్వెల్‌గా రూపొందే 'నామ్ షబానా' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం తాప్సీ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటోందట. దర్శకుడు నీరజ్‌పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని శివం నాయర్ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. మొత్తానికి ఈ సినిమాతో తాప్సీ బాలీవుడ్‌లో సెటిల్ అయిపోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







