కాట్రు వెళదిలై సినిమా షూటింగ్ హైదరాబాద్ లో..
- October 09, 2016
ఓకె బంగారం సినిమాతో ఫాంలోకి వచ్చిన గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం, మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. తన స్టైల్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో అభిమానులను అలరించేందుకు కాట్రు వెళదిలై సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీ, అదితిరావ్ హైదరీ హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కొద్ది రోజులుగా కార్తీ తన లేటెస్ట్ మూవీ కాష్మోరా పనుల్లో బిజీగా ఉండటంతో మణిరత్నం సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవల కాష్మోరా ఆడియో రిలీజ్ కార్యక్రమాలు పూర్తి కావటం, సినిమాకు మరి కాస్త సమయం ఉండటంతో ఈ గ్యాప్ లో మరో షెడ్యూల్ ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ షెడ్యూల్ హైదరబాద్ లోని పలు కీలక ప్రదేశాల్లో షూట్ చేసేలా ప్లాన్ చేశారు.పది రోజుల పాటు జరగనున్న హైదరాబాద్ షెడ్యూల్ తరువాత లడఖ్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. కొన్ని సాంగ్స్ తో పాటు యాక్షన్ సీన్స్ ను కూడా లడఖ్ లో షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ వరకు పూర్తి చేసి, జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







