స్టార్ హీరోల సంక్రాంతి పోటీ ...
- October 09, 2016
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంక్రాంతి అతిపెద్ద సీజన్. రెండు వారాలు సెలవులు ఉండే ఈ సమయంలో ఎక్కువ సినిమాలు విడుదలవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల మధ్య సంక్రాంతి పోటీ నెలకొనడం టాలీవుడ్ లో ఓ సంప్రదాయం. పండక్కి జరిగే కోడి పందేల్లా.అగ్ర కథానాయకులు తమ సినిమాలతో పరస్పరం ఢీ కొడుతుంటారు. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ వచ్చే ఏడాది పెద్ద పండక్కి ఇద్దరు జమాజెట్టీలు పోటీ పడుతున్నారు.వాళ్లే చిరంజీవి, బాలకృష్ణ. తెలుగు తెరపై వీళ్లిద్దరిని దాయాదులుగా అంచనా వేస్తుంటారు. చిరంజీవి 150 సినిమా 'ఖైదీ నెంబర్ 150', వీవీ వినాయక్ దర్శకుడు. కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తోంది.తమిళ రీమేక్ చిత్రమిది. కాగా బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చారిత్రక కథాంశంతో దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నారు. ఈ రెండు ప్రతిష్ఠాత్మక సినిమాలు సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్నాయి. 16 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు నటుల సినిమాలు పోటీకి వస్తుండటం విశేషం.అప్పట్లో 'మృగరాజు', 'నరసింహనాయుడు' బాక్సాఫీస్ దగ్గర తలపడగా.బాలకృష్ణ పైచేయి సాధించాడు. ఈసారి ఫలితం పండగ సమయమే తేల్చనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







