కమల్ చిన్న కూతురు అజిత్ తో నటించనుంది..
- October 10, 2016
ముద్దుగుమ్మ కాజల్ తమిళ్ స్టార్ అజిత్ తో జతకట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. 'వీరమ్', 'వేదాళం' చిత్రాల ఫేం శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. వీరి కలయికలో ఇప్పటికే రెండు హిట్స్ వచ్చాయి. ఈ చిత్రంలో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.ఈ సినిమాలో ఓ పాత్రలో అజిత్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నాడట. తమిళనాడులో జరిగిన ఓ పెద్ద నేరం పరిశోధనలో భాగంగా ఇంటర్ పోల్ ఆఫీసర్ ఇక్కడికి వస్తాడట. ఈ చిత్రంలో కాజల్ తో పాటుగా మరో హీరోయిన్ కి కూడా అవకాశం ఉంది. రెండో హీరోయిన్ గా కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ నటించనుంది.ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







