కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు
- October 10, 2016
కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు. అప్రమత్తమైన భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఈ ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాను, మరో పోలీసు గాయపడ్డారు. ప్రభుత్వ భవనంలో ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్టు భావిస్తుండటంతో సైన్యం వారిని చుట్టుముట్టింది. తొలుత ఉగ్రవాదులు పాంపోర్‌లోని ఇడిఐ భవనంలో ఉన్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందడంతో వారు ఆ భవనాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సైనికులను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.కాగా, పోంపోర్లో ఉగ్రదాడి ఘటన, తాజా పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు ఆర్మీ చీఫ్ వివరించారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







