పనిమనిషికి తన పైశాచిక చేష్టలతో భూలోక నరకం చూపిస్తున్న యజమానురాలు
- October 10, 2016
బతుకు జీవనం కోసం అందరూ తమ తమ దేశాలు విడిచి వెళ్లినవారే...ఎడారి దేశం చేరుకొనేసరికి పైత్యం ప్రకోపిస్తుంది...హోదాలు...బడాయిలు కొని తెచ్చుకొని కొందరు తమ తోటివారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విపరీత చేష్టలలో మరో ఆకు ఎక్కువ చదివిన ఓ 33 ఏళ్ల జోర్దానియాన్ యజమానురాలు ఇండోనేషియా దేశం నుంచి తన పనిమనిషిగా తెచ్చుకొన్న 28 ఏళ్ళ మహిళని తన పైశాచిక చేష్టలతో రాచి రంపాన పెట్టి హింసిస్తోంది. దుబాయ్ లో ఉంటున్నఈ యజమానురాలు..తన సైకో ప్రవర్తనతో పనిమనిషి ఎడమ చెవి లో కత్తెర నెట్టి గుండ్రంగా గిరా గిరా తిప్పడంతో ఆమె వినికిడి శక్తీ కోల్పోయింది..అలాగే వేడి వేడి ఇస్త్రీ పెట్టెను ఆమె శరీరంపై రుద్దడం...పొగలు కక్కే నీటిని ఆమెపై పోయడం వంటి ఎన్నో హింసలను పెట్టడంపై విసిగిపోయిన ఆ పనిమనిషి తన దేశమైన ఇండోనేషియా రాయబార కార్యాలయంకు వెళ్ళి పిర్యాదు చేసింది.
కోర్టులో ఆమెపై జరిగిన తీవ్రమైన భౌతిక దాడిని చార్జ్ చేసే సమయంలో ఖండించారు. అయితే ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం, గృహిణి తన పనిమనిషిని రాత్రివేళలో గదిలోపెట్టి తాళం వేస్తుందని అలాగే , తన భర్తతో బైటకు వెళ్ళినపుడు తన గదికి తాళం వెళ్లడం నిజమేనని ఒప్పుకొంది...అయితే పనిమనిషి తన పిల్లలను వంటరిగా ఆమె వద్ద విడిచి వెళ్తే ఆమె ఏమైనా చేస్తుందేమోనని తాళం వేసి వెళుతున్నట్లు పేర్కొంది. అలాగే తన పనిమనిషికి జూన్ 2015 నుండి ఈ సంవత్సరం మార్చి వరకు వేతనాన్నిఇవ్వడం లేదని పరిశోధకుల ముందు అంగీకరించారు. మూడు సంవత్సరాల క్రితం 28 ఏళ్ల ఇండోనేషియన్ మహిళ వారి వద్ద పని ప్రారంభించారు, తన యజమానురాలు నా పట్ల చేస్తున్న దురాగతాలు గూర్చి నా దేశం యొక్క కాన్సులేట్ ముఖ్యాధికారికి తెలిపినట్లు ఆ మహిళ చెప్పారు.ఆ గృహిణి కత్తులు, కత్తెరలు మరియు పాత్రలు ఉపయోగించడమే కాక పదునైన సాధనాలతో దాడి చేస్తుందని కాన్సులేట్ అధికారులకు ఆమె ఫిర్యాదు చేశారు. పలుమార్లు ఆమె గోడకి నా తలని కొట్టిందని నా జుట్టు పట్టుకొని లాగుతూ నా శరీరం మీద వేడినీరు పోయడం జరిగింది. ప్రతివాది హింసల వలన పనిమనిషి ఎడమ చెవి వినికిడి కోల్పోయింది," ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం చెవి గాయం కత్తెర ఫలితంగా ఏర్పడిందని తెలిసింది. . ఆమె ముఖం, తల, మెడ మరియు ఉదరం మీద ఇతర గుర్తులు ఆమె కత్తెర మరియు కత్తి లాంటి పదునైన పరికరాలతో దాడి జరిగినట్లు తేలింది.ఆమె వీపు, ఛాతీ, ఉదరం, చేతులు మరియు తొడ గాయం గుర్తులు ఆమెకి ఇస్త్రీ చేయడం ద్వారా శరీరం కమిలిపోయినట్లు సూచిస్తున్నాయి. పనిమనిషిని క్రమపద్ధతిలో సమయం ఒక నిర్దిష్ట కాలంలో హింసించారని ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







