దుబాయ్‌లో అగ్ని ప్రమాదం: 250 మంది తరలింపు

- October 10, 2016 , by Maagulf
దుబాయ్‌లో అగ్ని ప్రమాదం: 250 మంది తరలింపు

దుబాయ్‌: సిలికాన్‌ ఒయాసిస్‌లోని రెసిడెన్షియల్‌ టవర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అక్కడివారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఇద్దరు మహిళలు ఈ ఘటనలో గాయపడ్డారు. మొత్తం 250 మంది నివాసితుల్ని అక్కడినుంచి ఖాళీ చేయించారు అధికారులు. పొగ పీల్చడం ద్వారా 35 మందికి సమస్యలు తలెత్తగా, ఓ గర్భిణీ మహిళ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరో మహిళ కాలికి గాయమయ్యింది. సాయంత్రం 5.43 నిమిషాల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా, వెంటనే సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యల్ని ముమ్మరం చేశారు. ప్రమాదంలో ఎవరికీ తీవ్రగాయాలు కాకపోవడం పట్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా తక్షణం స్పందించిన దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ని అందరూ అభినందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com