యు. ఏ. ఈ., భారత్ సంబంధాలు మరింత ఎత్తుకు ఎదగాలి

- August 17, 2015 , by Maagulf
యు. ఏ. ఈ.,  భారత్ సంబంధాలు మరింత ఎత్తుకు ఎదగాలి

అధ్యక్షులు - షేక్ ఖలీఫా బిన్ జాయెద్ వారి నాయకత్వంలో భారత్ తో స్నేహసంబంధాలు ఆర్ధిక, అభివృద్ధి, వాణిజ్య, 

సాంస్కృతిక మరియు రాజకీయ వంటి  అన్ని రంగాలలో నూతన లక్ష్యాలతో మరింత ఎత్తులకు ఎదగాలని 

ఎదురుచూస్తున్నట్టు అబుధాబీ యువరాజు మరియు యు.ఏ.ఈ., సాయుధ దళాల డేప్యూటీ సుప్రీం కమాండర్ 

హిజ్ హైనెస్ షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ఆదివారం తెలిపారు. భారత ప్రధానిని, బృందాన్ని 

ఆహ్వానిస్తూ, ఈ పర్యటన  ఇరుదేశాల స్నేహం మరియు ద్వైపాక్షిక సహకారం యొక్క చక్కటి వ్యక్తీకరణ అని 

అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ చురుకైన పాత్ర నిర్వహిస్తోందని, గల్ఫ్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం 

మరియు అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడంలో కూడా కృషిచేయాలని ఆయన అభిలషించారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com