నిర్భయ రావణుళ్లను మర్చిపోతున్నాం : రాంగోపాల్ వర్మ
- October 11, 2016
తరచూ తన ట్వీట్స్‌తో వార్తల్లోకి వచ్చే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తనదైన తరహాలో వ్యాఖ్యలు చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని.. దసరా గురించి పేర్కొంటూ.. 'సీతా దేవిని అపహరించిన రావణుడ్ని శ్రీరాముడు వధించినందుకు ఈరోజు దసరా వేడుకను జరుపుకుంటున్నాం' అని పేర్కొన్న వర్మ ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యల్ని చేశారు.'1000 సంవత్సరాల క్రితం ఒక మహిళను అపహరించినందుకు రావణుడ్ని సంహరిస్తే.. అతడు మరణించినందుకు వేడుక జరుపుకుంటున్నాం. 1000 రోజుల్లో.. వెయ్యిరెట్లు దారుణమైన నిర్భయ రావణుళ్లను మర్చిపోతున్నాం.
ఎవరి నేరం ఆరాచకమైంది? ఒక మహిళను అపహరించి ఏమీ చేయని రావణుడిదా? లేక మహిళల్ని లైంగింకంగా వేధించి చంపిన రామ్‌దా(దిల్లీ నిర్భయ నిందితుడు రాంసింగ్‌ను ప్రస్తావిస్తూ)? మన కాలంలో రామ్‌సింగ్ లాంటోళ్లు ఘోరమైన విలన్లు. వాళ్లను వదిలేసి మనం మనలోలేని రావణుడి చావును వేడుకగా జరుపుకుంటున్నాం. 99 శాతం మంది ప్రజలు అసలు ఏం పట్టించుకోకుండా దసరాను జరుపుకుంటున్నారు'' అని వ్యాఖ్యానించారు.రామ్ సింగ్.. కసబ్ లాంటి వారి చావును వేడుకగా జరుపుకుంటే సామాజిక స్పృహ ప్రమోట్ అవుతుందన్న వర్మ.. ''ఈ రోజు రావణుడి చనిపోయి పెయిడ్ హాలిడే ఇచ్చి గొప్ప పని చేశాడు. ఆయనకు నేను దసరా శుభాకాంక్షలు చెబుతున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా' అని వర్మ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







