పాంపోర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
- October 12, 2016
పాంపోర్‌లో మూడు రోజులుగా ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్ ముగిసింది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఉదయం శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(ఈడీఐ) భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు మూడు రోజులుగా భద్రతా దళాలపైకి కాల్పులు జరుపుతున్న విషయం విదితమే. చివరికి బుధవారం మూడో రోజు భద్రతా దళాలు ముష్కరులను మట్టుబెట్టాయి. కాగా బిల్డింగ్‌లో మరో ఉగ్రవాది దాక్కుని ఉండొచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతునే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఉగ్రవాదులు ఈ బిల్డింగ్‌లోకి చొరబడి భద్రతాధికారులపై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఐదుగురు అధికారులు, ఇనిస్టిట్యూట్ ఉద్యోగి, ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అప్పట్లో జరిగిన ఆపరేషన్ 48 గంటల్లో ముగియగా తాజా ఆపరేషన్ 52 గంటల్లో ముగిసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







