సిరియా: వైమానిక దాడుల లో 16 మంది మృతి
- October 12, 2016
వైమానిక దాడులతో ఆ ప్రాంతం శిథిలాల గుట్టగా మారింది. శిథిలాల కింద ఎవరో ఉన్నారన్న అనుమానం వచ్చింది. బాలుడి మూలుగు వినిపించింది. సహాయ సిబ్బంది అతనిని సజీవంగా బయటకు తీయగలిగారు. ఈ ఘటన సిరియాలో జరిగింది. నిత్యం బాంబుల మోతలతో దద్దరిల్లే అలెప్పో నగరమది. ఆ రోజు కూడా వైమానిక దాడులు జరిగాయి. అవాస ప్రాంతాల్లోని కొన్ని భవనాలు నేలకొరిగాయి. వాటి కింద సజీవంగా ఉన్నవారి కోసం సిరియా రిస్క్యూ సిబ్బంది వెదకడం మొదలెట్టింది. ఒక చోట మూలుగు వినిపించింది. అక్కడ ఒక బాలుడు సజీవంగా కనిపించాడు. అతనిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. సిరియాలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆస్పత్రికి తరలించాగానే వారు చనిపోతున్నారు.ఈసారి మాత్రం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. తాజాగా జరిగిన దాడుల్లో 16 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







