లిమోస్ వాహనాలలో దుబాయ్ టాక్సీ ఉచిత " వైఫై " సౌకర్యం
- October 12, 2016
దుబాయ్ : దుబాయ్ టాక్సీ సంస్థ (డీటీసీ), రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) వినియోగదారులు సంతృప్తి చెంది మరియు వారిని సంతోషపర్చే లక్ష్యంతో ఉచిత వైఫై సేవలను వాహనాలలో ప్రవేశపెట్టింది.. తొలుత ప్రయోగాత్మకంగా అన్ని లిమోస్ కార్లలో ఏర్పాటు చేసి క్రమంగా ఈ సేవలను డిటిసి అద్దె కారులకు విస్తరించనున్నారు. దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ సీఈఓ డాక్టర్ యూసఫ్ మహమ్మద్ అల్ ఆలీ మాట్లాడుతూ , డిటిసి యొక్క లిమోసైన్స్ వాహనాలలో గొప్ప మరియు ఏకైక సేవని ప్రయోగాత్మకంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హోటళ్లు, విమానయాన సంస్థలు మరియు ఇతర పబ్లిక్ సంబంధిత లేదా పర్యాటక రంగంలో ఉన్న మా ఖాతాదారుల అవసరాలకు తగిన విధంగా అందించేలా ధీటుగా ఉంటాయని అన్నారు. ప్రైవేటు సంస్థలకు తమ సేవ దుబాయ్ నుండి అన్ని ఇతర ఎమిరేట్స్ ప్రాంతాలకు వారంలో 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ లిమోస్ వైఫై సేవలని అందించడంలో నిపుణులైన ప్రొవైడర్ తో ఒక ఒప్పంద సంతకం చేసింది. ఖాతాదారులకు రవాణా సమయంలో ఉచిత వైఫై పొందగోరేవారు విధిగా మా 113 లిమౌసిన్స్ను వాహనాలలో ప్రయాణించి ఆ సేవను పొంది నూతన అవధులు ధాటి మరియు అధిక నాణ్యత సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







