వలసదారులకు 'ఎన్ఓసి' రద్దుపై చర్చోపచర్చలు
- October 12, 2016
ఒమన్: మినిస్ట్రీస్ అలాగే రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి) మధ్య మల్టీ ఏజెన్సీ సమావేశాలు చోటు చేసుకుంటున్నాయి. వలసదారుల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసి) విషయమై ఈ చర్చలు జరుగుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వర్గాలు వెల్లడించాయి. లేబర్ ఇమ్మిగ్రేషన్‌ని సులభతరం చేసేందుకు ఇప్పటికే పొరుగు దేశాలు ఈ చర్యలు చేపట్టిన దరిమిలా, ఒమన్ కూడా ఆ బాటలో నడిస్తే, దేశంలో లేబర్ మార్కెట్ మరింతగా విస్తృతమవుతుందని ఇండస్ట్రీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మినిస్టర్ ఫర్ మేన్ పవర్ సలహాదారు సైద్ బిన్ నాజర్ అల్ సాది మాట్లాడుతూ 'ఎన్ఓసి ఆప్షన్ని రద్దు చేయాలనుకుంటున్నాం.. అది రద్దవుతుంది.. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చ జరుగుతోంది' అని చెప్పారు. ఒమన్‌లో జాబ్ చేంజెస్ కోసం వలసదారులు ఎన్ఓసి తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండేళ్ళపాటు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు అమలవుతాయి. ఈ కారణంగా, లేబర్ మార్కెట్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళుతోందని నిపుణులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







