'కోటికొక్కడు' ఆడియో విడుదల...
- October 12, 2016
సుదీప్, నిత్యామీనన్ జంటగా సి.ఎల్.ఎస్.మీడియా, లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్‌శెట్టి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'కోటికొక్కడు'. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ 'కోటికొక్కడు' వేడుక సోమవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. అతిథిగా పాల్గొన్న దర్శకరత్న దాసరి నారాయణరావు ఆడియో బిగ్ సీడీని ఆవిష్కరించగా, ఆడియో సీడీలను దర్శకుడు సముద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా సముద్ర మాట్లాడుతూ,' నా దర్శకత్వం 'కాకతీయుడు' చిత్రాన్ని లగడపాటి శ్రీనివాస్ నిర్మించారు. కన్నడలో ఘనవిజయం సాధించిన 'కోటికొక్కడు' చిత్రం తెలుగులోనూ పెద్ద విజయం సాధించాలి' అని చెప్పారు.'సుదీప్ కెరీర్‌లో 'ఈగ' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఆయన నటించిన ఈచిత్రం కన్నడలో సెన్సేషనల్ హిట్ సాధించింది. శోభారాణిగారు ఏ సినిమా చేసినా భారీ సినిమాలే ఉంటాయి. ఈ సినిమా కూడా తెలుగులో ఘనవిజయం సాధించాలని ఆశిస్తున్నాను'
అని టి.రామసత్యనారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రసన్నకుమార్, డి.ఎస్.రావు తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







