నిఖిల్ రెండో సినిమా పూరి జగన్నాథ్ తో....
- October 12, 2016
తాత మాజీ ప్రధాన మంత్రి.. తండ్రి మాజీ ముఖ్యమంత్రి.. ఇలాంటి బడా బ్యాగ్రౌండ్ తో భారీ రేంజ్ లో జాగ్వార్ తో ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ గౌడ. అయితే ఈ సినిమా ఆశించినంత లేదు.అది అలావుంచితే రెండో సినిమాకు కూడా భారీ గానే రెడీ వుతున్నాడు నిఖిల్. ఇందుకోసం దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోపేరు వినిపిస్తుంది.తన రెండో సినిమా కోసం సురేందర్ రెడ్డితో పాటు పూరి జగన్నాథ్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించాడు నిఖిల్. అయితే తుది నిర్ణయం తన తండ్రే తీసుకుంటాడని.. తన కథలన్నీ ఆయనే సెలక్ట్ చేస్తారని చెబుతున్నాడీ మాజీ ప్రధాని మనవుడు.అన్నట్టు పూరి దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వాల్సింది నిఖిల్.కానీ కుదరలేదు. ఇప్పుడు రెండో సినిమా వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







