క్యాన్సర్‌పై అవగాహన: పింక్ కలర్‌లో బుర్జ్ ఖలీఫా
- October 12, 2016
దుబాయ్: దుబాయ్‌కి చెందిన బుర్జ్ ఖలీఫా, ఈ వారంలో పింక్ కలర్‌లో వెలుగులు విరజిమ్మనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద టవర్ అయిన బుర్జ్ ఖలీఫాని, పింక్ కలర్‌లోకి మార్చడం వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సాయంత్రం పింక్ కలర్ లైట్స్‌ని స్విచాన్ చేస్తారు. వార్షిక బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా మాసం సందర్భంగా అక్టోబర్‌లో ఇలాంటి కార్యక్రమాలు చేపడ్తుంటారు. ఈ విషయాన్ని బఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా బుర్జ్ ఖలీఫాని సందర్శించేవారు పింక్ కలర్ దుస్తుల్లో రావాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్‌లో ప్రతి అమ్మకంపైనా ఒక ఎమిరేటీ దిర్హామ్‌ని అల్ జలిలా ఫౌండేషన్‌కి అందజేస్తామని బుర్జ్ ఖలీఫా నిర్వాహకులు వెల్లడించారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, బ్రెస్ట్ క్యాన్సర్‌ని తొలి దశలో గుర్తించేందుకు వీలుగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టడానికి ఈ ఫౌండేషన్‌ని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా వస్తున్న క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అతి ముఖ్యమైనది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







