ఎమరాల్డ్ మీడియా యప్ టీవీలో భారీ పెట్టుబడి
- October 13, 2016
ప్రముఖ గ్లోబర్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్ధ కేకేఆర్ కు చెందిన ఎమరాల్డ్ మీడియా మీడియా రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. దాదాపు 50మిలియన్ యూఎస్ డాలర్లకు యప్ టీవీ(yupp tv)లో కొంత భాగాన్ని సొంతం చేసుకుంది. ఆన్ లైన్ లో దక్షిణ ఆసియా టీవీ ప్రసారాలకు యప్ టీవీ పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా 14 భాషలకు చెందిన ప్రసారాలను యప్ టీవీ ఆన్ లైన్ లో అందిస్తోంది.250 దక్షిణ ఆసియా టీవీ చానళ్ల ప్రసారాలు, 5వేలకు పైగా సినిమాలు, 100కు పైగా టీవీ షోలను ప్రేక్షకులకు యప్ టీవీ అందిస్తోంది. అమెరికా, యూకే, మధ్య ఆసియా, కెనడా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కరీబియన్ లలో మార్కెట్ పై యప్ టీవీ ప్రత్యేకదృష్టిని సారించింది భారత్ లో కూడా యప్ టీవీకి ప్రాముఖ్యత ఉంది. ఎమరాల్డ్ మీడియా కంటే బలమైన భాగస్వామిని మేం కోరుకోమని యప్ టీవీ సీఈవో ఉదయ్ రెడ్డి చెప్పారు. ఎమరాల్డ్ మీడియాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్సంబధాలతో యప్ టీవీ ప్రసారాలకు ఉపయోగపడతాయని అన్నారు. దాదాపు 10మిలియన్లకు పైగా మొబైల్ యూజర్ల యప్ టీవీ అప్లికేషన్ ను వినియోగిస్తున్నారు. శాంసంగ్, ఎల్ జీ స్మార్ట్ టీవీల్లో ప్రీ ఇన్ స్టాల్డ్ యప్ టీవీ అప్లికేషన్ ను ఇస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







