వచ్చే ఏడాది నుంచి 1 గంట - డ్రైవింగ్ క్లాస్‌లు
- October 13, 2016
లెర్నర్ డ్రైవర్లు ఇకపై మినిమమ్ గంట క్లాసుల్ని రోజుకి తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే జనవరి నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టఇఎ) వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రోజుకి 30 నిమిషాలపాటు, మొత్తం 40 క్లాసులు ఉండేలా కోర్సులు అమల్లో ఉన్నాయి. వాటిని 20 గంటలు - ఒక్కో రోజుకీ మినిమమ్ గంటపాటు క్లాస్ ఉండేలా సవరించారు. మినిమమ్ ట్రైనింగ్ అవర్స్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. రోజుకి అత్యధికంగా 4 గంటల సమయమే క్లాసులు ఉండాలనీ, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రెండు గంటల ప్రాక్టికల్ ట్రైనింగ్ సమయంలో ఖచ్చితంగా ఒక గంటపాటు బ్రేక్ ఉండాలని కొత్త నిబంధనల్ని పొందుపరుస్తున్నారు. ఆర్‌టిఎ రోడ్ టెస్ట్‌లకు పంపించే ముందు పూర్తిస్థాయిలో తమ విద్యార్థుల్ని సన్నద్ధం చేయాల్సిన బాధ్యత ట్రైనింగ్ సంస్థలదేనని అఆర్‌టిఎ లైసెన్సింగ్ ఏజెన్సీ డైరెక్టర్ ఆరిఫ్ అల్ మలెక్ చెప్పారు. డ్రైవింగ్ టెస్ట్‌కి వెళ్ళే ముందే డ్రైవింగ్ స్కూల్ నిర్వహించే పరీక్షను అభ్యర్థులు పాస్ అవ్వాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







