జాతి నిర్మాణంలో మహిళ పాత్రపై సెమినార్
- October 13, 2016
మస్కట్: ఒమనీ వర్క్ ఫోర్స్‌లో ఎక్కువమంది మహిళలకు అవకాశం కల్పించే దిశగా ఏడవ ఒమనీ విమెన్స్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ సోసల్ డెవలప్‌మెంట్ నిర్వహించిన సెమినార్‌లో చర్చ జరిగింది. 100 మందికి పైగా మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్, స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'విమెన్ లీడర్‌షిప్ సెమినార్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్‌మెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ యాహ్యా బిన్ బాదర్ బిన్ మాలిక్ అల్ మావలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత విమెన్ లీడర్ షిప్ ట్రైనర్ మరియు కోచ్ డాక్టర్ బెర్నిస్ లెడ్‌బెట్టర్ (సెంటర్ ఫర్ విమెన్ ఇన్ లీడర్‌షిప్, పెప్పర్‌డైన్ యూనివర్సిటీ, అమెరికా డైరెక్టర్) ఈ ఈవెంట్‌లో ట్రైనింగ్ సెషన్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమన్‌టెల్ సిఇఓ తలాల్ బిన్ సైద్ మర్‌హూన్ మాట్లాడుతూ, మహిళలు పురుషులతో ఏ విషయంలోనూ తీసిపోలేరనీ, టాలెంట్ విషయంలో ఇద్దరూ ఒకటేనని అన్నారు. గత కొన్నాళ్ళుగా ఫిమేల్ స్టాఫ్ పెరుగుతూ వస్తున్నారని తలాల్ బిన్ వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







