దుబాయ్ లో దాండియా ఆటల నిర్వహణ
- October 13, 2016
గత 51 సంవత్సరాల నుండి దుబాయ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజస్థాన్ దాండియా సాంప్రదాయక సాంస్కృతిక నృత్య కార్యక్రమం సాంప్రదాయంగా కొనసాగతోంది. పట్టణ కార్యక్రమ నిర్వహణలో ఉత్తమ సంస్థగా పేరొందిన పరాజయ సోని ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఎల్ ఎల్ సి ఘనంగా నిర్వహించనుంది. యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనే ఈ కార్యక్రమం నిర్వాహకులుగా దిలీప్ సోని వైస్ ప్రెసిడెంట్ మరియు యు ఏ ఇ లో పరాజయ సోని కమ్యూనిటీ అధ్యక్షుడు హస్ముఖ్ దానక్ ఈ కార్యక్రమంను యుఎఇ లో ప్రజా సంబంధాల అధికారిగా ఓవిలియా ఫెర్నాండెజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి 3 వేల మంది పని రోజులలో దాండియా ఆటలలో పాల్గొంటారని సెలవు రోజులలో, ఈ సంఖ్య దాదాపు 7 వేల నుంచి 8 వేల వరకు సగటు సమూహాలు ఆనంద ఉత్సాహాలతో దాండియా కొనసాగించనున్నారు.రోజూవారీగా 50 నుంచి 60 వరకు పలు బహుమతులను వివిధ విభాగాలలో ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఉత్తమ నాట్యం,మంచి దుస్తులను ధరించినవారు ,ఉత్తమ జంట తదితర అన్ని వయసుల వారికి అదే రోజున అందిస్తామని వారు తెలిపారు. 9 రోజుల కాలవ్యవధిలో జరిగే దాండియా కార్యక్రమంకు 211 మంది వరకు పాల్గొననున్నారు. ఈ పోటీలో14 మంది విజేతలని ఎంపిక చేయనున్నారు. అలాగే పాల్గొనేవారందరికి ఏకీకరణ ( కన్సోలేషన్ ) బహుమతులను నిర్వాకులు అందచేయనున్నారు.








తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







