"చెవిలో పువ్వు" సినీ రచయిత వినయ్ మృతి
- October 13, 2016
పలు చిత్రాలకు కథను అందించిన రచయిత వినయ్ గురువారం హైదరాబాద్‌లో మృతి చెందారు. సీతాఫల్మండిలో నివాసం ఉంటున్న వినయ్‌కి బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కుటుంబసభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న వినయ్ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. వరంగల్ జిల్లాకు చెందిన వినయ్ పలు పత్రికల్లో కథలు, కధానికలు రాశారు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న అతనికి హైదరాబాద్‌కు బదిలీ కావటంతో సినిమాల్లో పనిచేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చెవిలో పువ్వు సినిమాతో రచయితగా అరగ్రేంటం చేశారు. తరువాత అమ్మనా కోడలా, ప్రేమఖైదీ, అమ్మదొంగా తదితర చిత్రాలకు రచయితగా పనిచేశారు.ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, వినయ్ వద్ద శిష్యరికం చేశారు. ఇటీవల సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్షుద్ర చిత్రానికి వినయ్ పనిచేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వినయ్‌కి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









