పరుగులు పెట్టించిన స్వల్ప అగ్ని ప్రమాదం
- October 13, 2016
దుబాయ్: డేరా క్రీక్ టవర్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సంభవించిన స్వల్ప అగ్ని ప్రమాదం కాస్సేపు, ఆ టవర్లో నివసిస్తున్నవారిని పరుగులు పెట్టించింది. సమాచారం అందుకున్న 10 నిమిషాల్లోనే దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని, మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. జరిగింది చిన్న అగ్ని ప్రమాదమేనని ఈ సందర్బంగా సివిల్ డిఫెన్స్ ప్రతినిథులు వెల్లడించారు. భవనం నాలుగో ఫ్లోర్లో సంభవించిన అగ్ని ప్రమాదంతో భవనంలోని ఫైర్ సేఫ్టీ అలారమ్ మోగిందనీ, దాంతో అందరం ఆ భవనాన్ని ఖాళీ చేశామని రెసిడెంట్స్ తెలిపారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది భవనాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాత, రెసిడెంట్స్ని ఆ భవనంలోకి అనుమతించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







