జిహాద్లో మహిళలంటే కేవలం బానిసలగానే పరిగణిస్తారు...
- October 14, 2016
బహిరంగ హత్యలు.. అత్యాచారాలతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన యువతను మత ఛాందసవాదంతో రెచ్చగొడుతూ అతి క్రూరంగా మార్చేస్తున్నారు. తల్లి, భార్య అన్న తేడా లేకుండా మహిళలంటే కేవలం బానిసలగానే పరిగణిస్తారు. ఇదే విషయంపై పెష్మెర్గా(కుర్దిస్థాన్ స్వయం పాలిత మండలి సైన్యం) ఆధీనంలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లను విచారిస్తే విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. ఉగ్రవాదుల అరాచకాలు.. మహిళల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తున్నారన్న దానిపై వాషింగ్టన్ పోస్ట్‌లో ఇటీవల ఈ కథనాలు ప్రచురితమయ్యాయి.ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న ఓ ప్రాంతంలో ఉంటున్న మిలిటెంట్ తన అనుభవాలను పంచాడు.ఉగ్రవాదుల దృష్టిలో మహిళలను కేవలం బానిసలుగానే పరిగణిస్తారని, సొంత భార్యను కూడా అలాగే పరిగణిస్తూ అనేక ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన మాటల్లో తెలుస్తోంది. 'నా భార్య ఎప్పుడూ బురఖా ధరించి ఉంటుంది. నేను లేకుండా బయటకు వెళ్లడం పూర్తిగా నిషిద్ధం. ఇస్లామిక్ స్టేట్‌లో స్లీపర్ సెల్స్‌ని నియమించేందుకు కుర్దుల ప్రాంతానికి వెళ్లినప్పుడు నా భార్యను హవిజా ప్రాంతంలో విడిచి వెళ్లాను. అదే సమయంలో భద్రతా దళాలు నన్ను అరెస్టు చేశాయి. ఇది జరిగి నాలుగు నెలలవుతుంది. ఇస్లామిక్ స్టేట్ షరియత్ చట్టాల ప్రకారం నా భార్య మరొకరిని వివాహం చేసుకోవచ్చు. మహిళలు ఉన్నదే పెళ్లి చేసుకోవడానికి పిల్లలను కనడానికి. జిహాద్లో వారి ఇష్టాలకు అవకాశం లేదు. మహిళలు ప్రాణాలతో మాత్రమే ఉంటారు. వారికి నచ్చినట్లుగా ఉండే అవకాశం లేదు.'ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దృష్టిలో యాజిదీ మహిళలను అత్యంత విలువైన బానిసలుగా పరిగణిస్తారా అని అడిగితే... 'యాజిదీ మహిళలు ఇస్లామిక్ స్టేట్‌లో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి కోసమే. వారంతా.. ఇస్లామిక్ స్టేట్‌కే సొంతం. మాకు ఎలా ఇష్టమైతే అలా వారిని ఉపయోగించుకుంటాం' అంటూ ఎలాంటి బెరుకు లేకుండా చెబుతున్నారు.మీరు బానిసలుగా చూస్తున్న మహిళల స్థానంలో మీ తల్లి ఉండి? ఆమెను కూడా ఉగ్రవాదులు అత్యాచారం చేసి అమ్మితే? నీ స్నేహితులు కొంత మంది ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే నీవు ఏం చేస్తావు? అని ఉగ్రవాదిని ప్రశ్నిస్తే.. విస్తుగొలిపే సమాధానమిచ్చాడు. 'వారి స్థానంలో మా అమ్మ ఉన్నా నేను అంతగా పట్టించుకోను. ఎందుకంటే.. ఇదంతా జిహాద్ కోసమే. ఇదే ఇక్కడి షరియత్ చట్టం. ఇక్కడ సామాజిక న్యాయవ్యవస్థ ఏదీ లేదు. కేవలం ఇస్లామిక్ లా మాత్రమే ఉంది. దాని ప్రకారమే నడుచుకుంటాము. మహిళలందరూ దిగువ స్థాయికి చెందినవారే' అంటూ సమాధానమిచ్చాడు.దీన్ని బట్టే ఉగ్రవాదుల మనసులో ఎంత మత ఛాందసవాదం నిండిపోయిందో అర్థమవుతోంది. మహిళల పట్ల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







