బహరేన్ లో అక్రమ నిర్వాసితుల కోసం కొత్త 'అనువైన' పని అనుమతి

- October 14, 2016 , by Maagulf
బహరేన్ లో  అక్రమ నిర్వాసితుల కోసం  కొత్త 'అనువైన' పని అనుమతి

 ఒక నూతన "సరళమైన" పని అనుమతిని తరువాత కొద్ది నెలల బహరేన్ లో  ప్రారంభించబడనుంది.దేని ద్వారా 10,000 మంది  అక్రమ నిర్వాసితులకు న్యాయముగా రెండు సంవత్సరాల పాటు బహుళ ఉద్యోగులుగా పనిచేయటానికి అనుమతించబడతారు. యజమానుల ద్వారా దోపిడీకి గురైనవారు  వీసా పరిమితికి మించి ఎక్కువకాలం దేశంలో ఉండిపోయిన కార్మికుల కోసం పరిమితం కాబడిన సంఖ్యలో కొత్త 'అనువైన' పని అనుమతి కల్పించనున్నట్లు   లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తెలిపింది. పని అనుమతి కోసం 80 యు ఎస్ డాలర్ల  (30 బి డి ) చెల్లించాలి. గతంలో ఒకేసారి 530 యు ఎస్ డాలర్ల (200 బి డి) ఇందుకై చెల్లించేవారు కానీ ఇపుడు నెలకో మారు వాయిదాల పద్ధతిలో రుసుము  చెల్లిస్తే చాలు.  అయితే గతంలో తమ ఉద్యోగాల నుండి పారిపోయినవారు  లేదా తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఉద్యోగులకు పైన పేర్కొన్న అవకాశం ఉండదు. 2015 లో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ లెక్కల ప్రకారం, బహరేన్ లో  దాదాపు 32,000 మంది అక్రమ కార్మికులు 60,000 మంది అక్రమ నివాసితులు ఉన్నట్లు తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com