ఫ్రీ సిరియన్ ఆర్మీ చెక్ పోస్ట్ వద్ద కారు బాంబు పేలింది..
- October 14, 2016
సిరియా, టర్కీ సరిహద్దులోని ఫ్రీ సిరియన్ ఆర్మీ చెక్ పోస్ట్ వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఎక్కువగా సిరియా తిరుగుబాటుదారులు ఉన్నట్లు భావిస్తున్నారు. బాబ్ అల్ సలామ్ సరిహద్దు సమీపంలో జబత్ అల్ షమియా అనే తిరుగుబాటుదారుల ఆధీనంలోని చెక్పోస్ట్ వద్ద పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు సమాచారం. పేలుళ్లలో 30 మంది మరణించారని టర్కిష్ మీడియా తెలిపింది. డజన్ల మంది గాయపడగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







