డ్రాగ్‌ అండ్‌ డ్రిఫ్ట్‌ నైట్‌

- October 14, 2016 , by Maagulf
డ్రాగ్‌ అండ్‌ డ్రిఫ్ట్‌ నైట్‌

మనామా: ఇక్కానో డ్రాగండ్‌ డ్రిఫ్ట్‌ నైట్‌ సోమవారం బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ (బిఐసి) - సాఖిర్‌లో గగుర్పొడిచే విన్యాసాలతో జరగనుంది. మోటర్‌ సిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఔత్సాహికులు డ్రాగ్‌ రేసింగ్‌ మరియు డ్రిఫ్టింగ్‌లో పాల్గొనేందుకు సొంత కార్లు, మోటర్‌ బైక్‌లతో రావాల్సి ఉంటుంది. అలాగే అనుభవజ్ఞులు చేసే సాహసాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. రెండు యాక్టివిటీస్‌ కోసం సింగిల్‌ ఫీజుతో ఎంజాయ్‌ చేయడానికి ఆస్కారం కల్పించారు. డ్రాగ్‌ అండ్‌ డ్రిఫ్ట్‌లో ప్యాసింజర్‌లా ఎంజాయ్‌ చేయాలనుకునేవారు స్నేహితుడి కారులో అదనపు పీజు చెల్లించి ప్రతి ఈవెంట్‌లోనూ పాల్గొనేందుకు అవకాశం ఉంది. కేవలం ఒక్క సెకెనులోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ ఈవెంట్‌ ప్రత్యేకత. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ గగుర్పొడిచే సాహసకృత్యాలకు డ్రాగ్‌ అండ్‌ డ్రిఫ్ట్‌ కార్యక్రమం పెట్టింది పేరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com