కోలీవుడ్ లో కొబ్బరిమట్ట
- October 15, 2016
ఆన్లైన్ సెన్సెషన్‌గా వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న స్టార్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూ తరువాత పలు చిత్రాల్లో అతిథి పాత్రలతోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కొబ్బరిమట్ట సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. పాపరాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడు అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు సంపూ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్ ఒకరు ఈ సినిమా రైట్స్ కోసం ట్రై చేస్తున్నారు. భారీ మొత్తం చెల్లించి రైట్స్ సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
సంజన మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తొలిసారి సంపూర్ణేష్ సినిమాను ఓవర్సీస్లోనూ మిడ్ వెస్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా భారీగా రిలీజ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







