యు.ఏ.ఈ జాతీయులు నుండి 199 సజీవ నక్షత్ర తాబేళ్లు స్వాధీనం

- October 15, 2016 , by Maagulf
యు.ఏ.ఈ  జాతీయులు నుండి 199 సజీవ నక్షత్ర తాబేళ్లు స్వాధీనం

తొమ్మిది సజీవ నక్షత్ర తాబేళ్లను అక్రమ రవాణా చేస్తున్న యుఎఇ  పాస్పోర్ట్ కల్గిన ఇరువురు వ్యక్తులను భారతదేశం ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు  గురువారం రాత్రి  అదుపులోనికి తీసుకొన్నారు. వారికి చెందిన నాలుగు ట్రాలీలను తనిఖీ చేస్తున్న సమయంలో పెద్ద సంచులలో 199 బతికి ఉన్న నక్షత్ర తాబేళ్లను గుర్తించారు. ఇరువురిపై అధికారులు కేసుని  నమోదు చేశారు.

ఇద్దరు ప్రయాణీకులలో ఒకరి పేరు ఎం.ఏ కాగా మరొక వ్యక్తి పేరు ఎస్ ఐ గా అధికారులు తెలిపారు. ముంబై లో ఈ నక్షత్ర తాబేళ్లని  కొనుగోలు చేసి వాటిని అక్రమంగా యు ఏ ఇ తరలించే యత్నంలో అధికారులకు దొరికిపోయారు. ఒక సీనియర్ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ తాబేళ్లు జాతిని గుర్తించదానికి  రాష్ట్ర అటవీ శాఖ సహాయం కోరామని  చెప్పారు. ఈ అక్రమ రవాణా వన్యప్రాణుల చట్టం యొక్క పరిధి కింద వస్తాయిని ఈ తరహా తాబేళ్ల ఎగుమతి మరియు దిగుమతి భారతదేశం నుండి  నిషేధించబడ్డాయని ఆయన తెలిపారు.ఈ తాబేళ్లను ఇరుకైన సంచులలో బంధించి ఇటువంటి అక్రమ రవాణా చేస్తున్న సమయంలో అనేక ప్రాణులు  మరణిస్తున్న సందర్భాలు అనేకమని ఆ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి  తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com