'మన్యంపులి'గా మోహన్ లాల్
- October 15, 2016
జనతా గ్యారేజ్' సినిమాతో తెలుగులోనూ సూపర్ హిట్ అందుకున్న మోహన్ లాల్.. 'పులిమురుగన్' లా మల్లూవుడ్ లో మరోసారి తన విశ్వరూపాన్ని చూపాడు. దసరా కానుకగా మళయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్.. అక్కడ కలెక్షన్ల మోత మోగిస్తోంది. మల్లూవుడ్ చరిత్ర లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'పులి మురుగన్' చిత్రం త్వరలోనే తెలుగునాట కూడా సందడి చేయనుంది. ఈ విజువల్ వండర్ ను తెలుగులో 'మన్యంపులి' పేరిట శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విడుదలైన తొలి వారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మల్లూవుడ్ లో 'పులిమురుగన్' రికార్డ్ క్రియేట్ చేసింది. 'బాహుబలి' తరువాత ఆ ఘనత ఈ చిత్రానికే దక్కడం విశేషం. ఇక ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం దక్షిణాది అగ్రనిర్మాణ సంస్థలన్నీ పోటీ పడినా.. చివరకు శ్రీ సరస్వతి ఫిల్మ్స్ కే దక్కడం విశేషం. కాగా సింధూరపువ్వు కృష్ణారెడ్డి గతంలో అనువాద చిత్రంగా 'సింధూరపువ్వు'ను రిలీజ్ చేసి అతిపెద్ద విజయాన్ని సాధించి తెలుగునాట 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డిగా ప్రాముఖ్యతను పొందారు.
తాజా వార్తలు
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!







