కింగ్ ఫిష్ ధరలు తగ్గే అవకాశం
- October 15, 2016
దోహా: కింగ్ ఫిష్ ధరల్లో అనూహ్యంగా తగ్గుదల నమోదు కానుంది. రానున్న రోజుల్లో ధరలు బాగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. కింగ్ ఫిష్ వేటపై నిషేధం నేటితో ముగియడంతో, చేపల వేట పెరగనుంది. తద్వారా మార్కెట్లోకి కింగ్ ఫిష్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డిమాండ్‌కి మించి కింగ్ ఫిష్ మార్కెట్లోకి వస్తే ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కింగ్ ఫిష్ ధర 65 ఖతారీ రియాల్స్ (కిలో) వరకు ఉంది బ్యాన్ కాలంలో. ఈ ధర 20 నుంచి 18 ఖతారీ రియాల్స్ వరకు తగ్గవచ్చునని సమాచారమ్. ఆగస్ట్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మూడు నెలలపాటు కింగ్ ఫిష్ వేటపై బ్యాన్ విధించారు. ప్రతి యేడాదీ సముద్రంలో బ్రీడింగ్ సీజన్ కారణంగా ఈ నిషేధం ఉంటుంది. తద్వారా సముద్ర జీవుల సమతౌల్యం దెబ్బతినకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







