రష్యాతో భారత్ భారీ రక్షణ ఒప్పందం
- October 15, 2016
గోవాలో ప్రారంభమైన రెండురోజుల బ్రిక్స్ సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య శనివారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. రైల్వేలు, స్మార్ట్‌సిటీలు, కుడంకుళం న్యూక్లియర్ ప్లాంట్, నౌకా నిర్మాణం సహా పలు రంగాల్లో 16 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైన డిఫెన్స్ డీల్‌ను రష్యాతో భారత్ కుదుర్చుకుంది. రూ.39,000 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతమైన విమాన విధ్వంసక రక్షణ వ్యవస్థ (యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్) 'ఎస్- 400 ట్రియంఫ్' సేకరణకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా నుంచి ఎస్-400 ట్రియంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేస్తున్నట్టు ఒప్పందంపై సంతకాల అనంతరం భారత్ ప్రకటించింది.
సూదూర లక్ష్యాలను ఛేదించ గలిగిన ఎస్-400 ట్రియంఫ్లను కొనుగోలు చేయడం వ్యూహాత్మకంగా భారత్ తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దుల వెంబడి ఇండియా డిఫెన్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు ఎస్-400 ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణలు సమర్ధవంతంగా ఉపయోగపడతాయని మిలటరీ అధికారులు చెబుతున్నారు. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణలు, 400 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లనూ ధ్వంసం చేయగలగిన సామర్థ్యం ఈ ఎస్-400 ట్రియంఫ్ ఎయిర్ డిపెన్స్ సిస్టమ్‌కు ఉంది. ఐదు ఎస్-400 సిస్టమ్స్‌ల కొనుగోలు చేయాలని భావిస్తున్న భారత్ ఏడాదిగా రష్యాతో చర్చలు జరుపుతోంది.
మూడు తరహాల్లో క్షిపణులతో విరుచుకపడటం, ఏకకాలంలో 36 లక్ష్యాలను ఛేదించగలగడం ఈ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకత. కాగా, నాలుగు అడ్మిరల్ గ్రిగోరోవిచ్-క్లాస్ (ప్రాజెక్ట్ 11356) గైడెడ్-మిసైల్ స్టీల్త్ ఫ్రిగేట్స్కు సంబంధించి మరో కీలక ఒప్పందం కూడా భారత్-రష్యాల మధ్య కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం కామ్‌కోవ్ హెలికాప్టర్ల తయారీని సంయుక్తంగా చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







