పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు
- October 15, 2016
పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలున్నట్లు 'డాన్' పత్రికలో వచ్చిన కథనం తీవ్ర స్థాయిలో అలజడి సృష్టిస్తోంది. శుక్రవారం కార్ప్స్ కమాండర్ల సమావేశం ముగిసిన తర్వాత సైన్యం నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి హెచ్చరిక సంకేతాలు పంపించింది. ఈ నెల 3న జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన రహస్య వివరాలను 'డాన్' ప్రతినిధి సిరిల్ అల్మీదాకు పీఎంఓలో ఉన్నవారే ఇచ్చి ఉంటారని, ఆ వ్యక్తి ఎవరో 5 రోజుల్లోగా బయటపెట్టాలని స్పష్టం చేసింది. అదే సమయంలో 'డాన్' కథనం కల్పితమని, తప్పు అని ప్రకటించింది. ఈ కథనం దేశ భద్రతకు ప్రమాదకరమని చెప్తున్న సైన్యం... తప్పుడు సమాచారం వల్ల ఏ విధంగా హాని జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది.ఈ నేపథ్యంలోనే పాక్ పీఎంఓ సిరిల్ అల్మీదాను ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌లో పెట్టింది. దీనిపై అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. సిరిల్ అల్మీదా రాసిన కథనంలో అత్యంత సూక్ష్మమైన వివరాలు ఉన్నాయి. వాటిని ఆ పత్రిక సంపాదకుడు కూడా సమర్థించారు.
తాము మళ్ళీ మళ్ళీ సరిచూసుకొని ఈ కథనాన్ని ప్రచురించామని స్పష్టం చేశారు. అయితే ఈ కథనం నవాజ్ షరీఫ్‌కు ఆయన సోదరుడు, పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్‌కు అనుకూలంగా, సైన్యానికి వ్యతిరేకంగా ఉందని ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ మండిపడుతున్నారు. అన్నదమ్ములిద్దరూ ఉగ్రవాదులను కటకటాల్లోకి నెట్టే యోధులుగా ఈ కథనంలో చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







