కరాచీ నుంచి ముంబై, ఢిల్లీకి విమాన సర్వీసులను పీఐఏ రద్దు చేసింది..
- October 16, 2016
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో కరాచీ నుంచి ముంబై, ఢిల్లీకి విమాన సర్వీసులను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) రద్దు చేసింది. ప్రయాణికుల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది. ఉడీ ఉగ్రదాడుల ప్రభావం విమాన సర్వీసులపైనా పడింది.దీనిపై పీఐఏ శనివారం ఓ ప్రకటన చేసింది. లాహోర్-ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు యాథాతథంగా కొనసాగుతున్నాయని పీఐఏ అధికారి తెలిపారు. గత మూడు, నాలుగు వారాలుగా కరాచీ నుంచి ముంబై, ఢిల్లీకి వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, దీంతో ఆ మార్గాల్లో నడిచే విమానాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.అయితే ఇప్పటికే రద్దు చేసిన మార్గాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వేరే రూట్లలో నడిచే విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.అలాగే భారత్ నుంచి కరాచీ వచ్చే ప్రయాణికులు ఢిల్లీ, ముంబైలోని పీఐఎ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. కాగా భారత్ నుంచి పాకిస్తాన్ ను నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసులు లేవు. పాక్ ఇంటర్నరేషనల్ ఎయిర్ లైన్స్ ద్వారానే ఇరు దేశాల మధ్య రాకపోకలు కొనసాగేవి. ఢిల్లీ-కరాచీ, ఢిల్లీ-లాహోర్, ముంబై-కరాచీల మధ్య అయిదు విమానాలు నడిచేవి. పీఐఏ నిర్ణయంతో శనివారం నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







