బాగ్దాద్‌లో మళ్ళీ పేలుడు.. 10మంది మృతి

- October 17, 2016 , by Maagulf
బాగ్దాద్‌లో మళ్ళీ పేలుడు.. 10మంది మృతి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో మళ్లీ పేలుడు సంభవించింది. ఇరాకీ ఆర్మీ చెక్‌పోస్ట్‌ లక్ష్యంగా కారు బాంబుతో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు భద్రత, వైద్య సిబ్బంది వెల్లడించారు. మరో 17 మంది గాయాలపాలైనట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల స్వాధీనంలో ఉన్న మొసుల్‌ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇరాకీ సేనలు దాడులు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదులు బాగ్దాద్‌పై విరుచుకుపడ్డారు. అయితే ఈ ఘటనపై ఇస్లామిక్‌ స్టేట్‌ బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

రెండు రోజుల క్రితం బాగ్దాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 50 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com