ఒడిషాలో భారీ అగ్నిప్రమాదం

- October 17, 2016 , by Maagulf
ఒడిషాలో భారీ అగ్నిప్రమాదం

ఒడిషాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భువనేశ్వర్‌లోని ఐఎంఎస్‌ & ఎస్‌యూఎం ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 22 మంది మృతి చెందగా, 75 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఐసీయూ వార్డులో కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వార్డులో కదలలేని స్థితిలో ఉన్న వారు అక్కడికక్కడే కాలిపోయారు. మొదట డయాలసిస్ వార్డులో మంటలు చెలరేగి, మెడిసిన్, ఐసీయూ వార్డులకు మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారాన్ని అందిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. షాక్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొంత మంది పరిస్థితి విషమంగా మారింది. మృతులు, క్షతగాత్రుల వివరాలను తమకు పంపాలంటూ కేంద్రం తెలిపింది.

ఐసీయూలో ఉన్నవారు కూడా చనిపోయిన వ్యక్తుల్లో ఉండటం గమనార్హం. 9ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com